Search This Site

Friday, December 13, 2019

Dosakaya Tomato Pachadi recipe in Telugu

దోసకాయ టమాటో పచ్చడి
పుల్లపుల్లగా కారంకారంగా ఈ పచ్చడి చాలా బావుంటుంది.
Image result for dosakaya tomato pachadi imagesకావలసినవి:
దోసకాయలు 2
టమాటాలు 2
పచ్చిమిర్చి 5
పోపు దినుసులు
నూనె 3 స్పూన్లు
కరివేపాకు రెండు రెమ్మలు
ఉప్పు ,కొత్తిమీర తగినంత
విధానం:
దోసకాయలు చెక్కు తీసి చేదు చూసుకుని ముక్కలు చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బానలి లో రెండు స్పూన్లు నూనె వెసి అది వేడి అయ్యాక దోసకాయ ముక్కలు వెసి మూడు నిముషాలు వెయించుకోవాలి. మరీ మెత్తగా మగ్గాల్సిన అవసరం లేదు. అవి తీసేసి టొమటోలు,మిర్చి వేసి మూడు నిముషాలు వేయించండి. రోట్లొ ముందు దొసకాయ వేసి కచ్చ పచ్చిగా నూరాక టొమటోలు మిర్చి వేసి నూరుకోండి. ఆఖర్న కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వెసి నూరి గిన్నెలోకి తీసుకుని ఇంగువ వేసి పోపు వెయ్యండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తో తింటే అంతే అదిరిపొతుంది రుచి!

No comments:

Post a Comment