రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే మునగాకుతో పచ్చడి ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు
- మునగాకు : కప్పు
- జీలకర్ర : టీస్పూను
- వెల్లుల్లి : 6 రెబ్పలు
- నువ్వులు : పావు కప్పు
- పసుపు : కొద్దిగా
- ఉప్పు : తగినంత
- నూనె : 2 టీస్పూన్
- పచ్చిమిర్చి : ఆరు
- చింతపండు : కొద్దిగా
- తాలింపుకోసం :
- ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి : కొద్దికొద్దిగా
- కరివేపాకు : రెండు రెబ్బలు
తయారు చేయు విధానం
- ముందుగా బాణిలో నువ్వులు వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి.
- అదే బాణిలో నూనె వేసి కాగాక, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన మునగాకు వేసి వేయించి చల్లార్చాలి.
- మిక్సిలో ముందుగా నువ్వులు వేసి పొడి చేశాక, వెల్లుల్లి, జీలకర్ర, వేసి తిప్పాలి.
- తరువాత పచ్చిమిర్చి, మునగాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి.
- చిన్న బాణిలో కొద్దిగా నూనె వేసి తాళింపు దినుసులు వేసి వేయించి పచ్చడిలో కలపాలి.
No comments:
Post a Comment