Search This Site

Friday, April 19, 2019

Regu pandla pachadi in Telugu

రేగి పచ్చడి


regi-pachadiకావాల్సినవి : 
రేగుపండ్లు : పావు కిలో, పచ్చిమిర్చి : 10, నువ్వులు : పావు టీస్పూన్, ఎండుమిర్చి : 2, మినప పప్పు : ఒక టీస్పూన్, కరివేపాకు : ఒక రెమ్మ, కొత్తిమీర : చిన్న కట్ట, ఇంగువ : చిటికెడు, ఆవాలు : పావు టీస్పూన్ 
జీలకర్ర : పావు టీస్పూన్, ఎండుమిర్చి : 2, నూనె, ఉప్పు : తగినంత

తయారీ : 
ముందుగా రేగు పండ్లలో గింజలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేయాలి. రోటిలో రేగు పండ్లు, ఉప్పు, వేయించిన పచ్చిమిర్చి వేస మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి నువ్వులు, ఎండుమిర్చి, మినప పప్పు, కరివేపాకు, ఇంగువ, చివరగా కొత్తిమీర వేసి పోపు పెట్టుకోవాలి. దీన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. టేస్టీగా ఉండే రేగు పండ్ల పచ్చడి మీ ముందుంటుంది. 

No comments:

Post a Comment